మేకల పెంపకం
వ్యవసాయానికి అనువుగా లేని, వర్షపాతం తక్కువగా ఉన్న ప్రాంతాలు మేకల్ పెంపకానికి అనుకూలంగా ఉంటాయి. మేకలు కలుపు మొక్కలను, ముళ్ళ పొదలను, బీడు భూములను, పంట కోసిన మోడళ్లను సమర్థవంతంగా ఉపయోగించుకొని విలువైన మాంసం, చర్మం, మరియు, పంటపొలాలకు, అడవులకు అధిక సత్తువ గల ఎరువునిస్తాయి. వీటిని పెద్ద పశువులతోగాని గోర్రేలతోగాని పోలిస్తే తక్కువ ఖర్చుతో, మామూలు పాకల్లో లేదా ఆరుబయళ్ళలో పెంచవచ్చు. ఇతర పశువులతో పోలిస్తే త్వరితగతిన వ్రుద్దిచెంది ఒకే ఈతలో రెండు లేక మూడు పిల్లలు రావడంవల్ల, అధిక రోగ నిరోధక శక్తి కలిగి మరియు ఆరోగ్య సమస్యలు తక్కువ ఉండటంవల్ల, బాగా ఆదాయం వస్తుంది. మన ప్రాంతానికి అనువైన జాతులను ఎంచుకోవడం వల్ల నభాసాటిగా మేకల పెంపకం చేపట్టవచ్చు.

మేకలలో ముఖ్య జాతులు

జమునాపరి:
ఇది మేక జాతుల్లో ఎత్తైనది. ఈ జాతిమేకలు ఉత్తరప్రదేశ్లోని మధుర, ఇటావా ప్రాంతాల్లో దొరుకుతాయి. ఈ జాతి మేకలు తెల్లగా, శరీరంపైన గోధుమరంగులో చుక్కలు కలిగి ఉంటాయి. గొంతు, ముఖం వద్ద ఎక్కువగా ఈ మచ్చలుంటాయి. ముక్కు భాగం ఉబ్బెత్తుగా ఉంది, ఒత్తుగా వెంత్రుకలుంటాయి. చెవులు పొడవుగా ఉంది వేలాడుతూ ఉంటాయి.  మగ, ఆడ రెండింటిలోనూ కొమ్ములుంటాయి. ఈ జాతి మేకలకు చిన్నగా సంననితోక ఉంటుంది. ఈ జాతి మేకలు ఒకటి నుంచి రెండు లీటర్లు పాలిస్తాయి.

బార్బరి:
ఈ జాతి మేకలు ఉతరప్రదేశ్ లోని మధుర, ఇటావా, ఆలీగర్ ప్రాంతాల్లో లభ్యమవుతాయి. ఈ జాతి ఒకే ఈతలో రెండు లేక మూడు పిల్లలను ఈనుతుంది. ఇవి చిన్నగా, తెల్లగా ఉండి, చర్మంపై లేత గోధుమ రంగులో మచ్చలు ఉంటాయి. చెవులు చిన్నగా ఉంది నిక్కబొడ్చుకొని ఉంటాయి. మేకపోతుల్లో కొమ్ములుంటాయి. ఈ జాతి మేకలు రోజుకు ౭౦౦ మీ.లీ. నుంచి లీటరు వరకు పాలిస్తాయి.

బీటల్:
ఈ జాతి మేకలు పంజాబ్ మరియు హర్యానాలో లభ్యమవుతాయి. ఇవి పెద్దగా ఉంది, (జమునాపరి కంటే చిన్నవి). నల్ల రంగులో ఉంటాయి. చెవులు వేలాడుతుంటాయి.  ముక్కు భాగం ఉబ్బెత్తుగా ఉంటుంది. తోక సన్నగా మరియు చిన్నగా ఉంటుంది. మేకలు, మేకపోతుల్లో కొమ్ములుంటాయి. ఇవి రెండు లీటర్ల దాకా పాలిస్తాయి.

ఉస్మానాబాది :
ఈ జాతి మేకలు మహారాష్ట్రలోని ఉద్గిరి, లాతూర్, ఉస్మానాబాద్ జిల్లాల్లో లభ్యమవుతాయి. శరీరకరం పెద్దదిగా ఉంది, నల్లరంగులో ఉంటుంది. శరీరంపై తెల్ల రంగులో మచ్చలుంటాయి. అరలీటరు నుండి లీటరున్నర వరకు పాలనిస్తాయి.

బ్లాక్ బెంగాల్:
ఇవి చిన్నగా, ఎక్కువగా నల్లరంగులో ఉంటాయి. అక్కడక్కడ గోధుమరంగులో మరియు తెలుపు రంగులో నభ్యమవుతాయి. వీటి చెవులు మొనదేలి ఉండాలి. ఇవి త్వరగా కడతాయి. ఎక్కువ పిల్లల్ని పెడతాయి. మేకల్లో, మేకపోతుల్లో కొమ్ములుంటాయి. వీటి చర్మం చాలా ఖరీదైనది. మాంసానికి ప్రసిద్ధి చెందింది.

 

మేకల మేత
 మేకలు అభివృద్ది కావాలంటే వాటికి కావలసిన మేపును సమకూర్చాలి. మేకలను కనీసం రోజుకు 8 నుండి 10 గంటల వరకు భీడు భూముల్లో, పంతకోసిన పొలాల్లో, అడవుల్లో మేపాలి. వీటితోపాటు పాక చుట్టూ ప్రక్కల ఉన్న స్థలంలో పచ్చిమేతలు పెంచాలి. మేకలు పచ్చిగాద్దితోపాటు ఎక్కువ చెట్ల, ఆకులను, పండ్లతోక్కలను, కూరగాయల ఆకులను ఇష్టపడతాయి. కావున పశుగ్రాసాన్నిచ్చే చేట్లయినటువంటి సుబాబుల్, అవిశ, రావి, తుమ్మ, అల్లనేరేడు, సీమచింత, వేప మొదలగు వాటి ఆకులను సమృద్ధిగా ఉపయోగించవచ్చు. వీటితోపాటు కాయజాతి ఎకవార్శికాలైన జొన్న, సజ్జ, మొక్కజొన్న మరియు పప్పుజాతి పశుగ్రాసాలైన అలసంద, హెడ్జిలూసర్న, స్టైలో మొదలగునవి పెంచాలి. క్యాబేజీ, కాలిఫ్లవర్, క్యారట్ కుఉరగాయలు ఆకులను కుడా తింటాయి.
పచ్చిమేత ఇచ్చేటప్పుడు షుమారుగా 1 కిలో చెట్ల ఆకులు, 1 కిలో కాయజాతి పచ్చిమేతలు, ౩ కిలోల ఇతర పశుగ్రాసాలివ్వాలి.
విత్తనపు మేకపోతుల పోషణ : విత్తనపు మేకపోతులకు వేరే వసతి కల్పించి వాటికి కావలసిన ఆహార పోషక పదార్థాలను సమకూర్చాలి. ప్రతి మేకపోతుకు ఒక్కొక్క దానికి ౩౦౦ గ్రాముల చొప్పున మిశ్రమ  దాణా ఇవ్వాలి. దాటడానికి ఉపయోగించే రోజుల్లో దాణా రోజుకు 500 గ్రా. (ఒక్కింటికి) ల చొప్పున ఇవ్వాలి. శుబ్రమైన త్రాగేనీటిని అందుబాటులో ఉంచాలి.
మేకపోతులకు, పెద్దమేకలకు ఇచ్చే దాణా మిశ్రమంలో 20 భాగాల మొక్క జొన్నలు, 5 భాగాల వేరుశెనగ పిండి, 20 భాగాల గోధుమ పొట్టు, 20 భాగాల బియ్యపు తవుడు, 18 భాగాల బియ్యపు నూక, 14 భాగాల జొన్నలు మరియు సజ్జలు, 2 భాగాల లవణ మిశ్రమం, 1 భాగం ఉప్పు ఉండాలి.
స్తానికంగా దొరికే ముడి సరుకులనుపయోగించి కావలసిన పోషక విలువలు ఉండేలా దాణా మిశ్రమాన్ని తయారు చేసుకొనవచ్చు.

 

మేకల గృహవసతి:
ఎత్తైన, నీరు నిలవని, మురుగునీరు బయటికి పోయే ప్రదేశాల్లో మేకల కొట్టాలు నిర్మించాలి. ఎల్లప్పుడు చల్లగా, పరిశుభ్రంగా తగినంత గాలి, స్థానికంగా దొరుకు కలపగాని లేదా రాతి స్తంబాలపైన గాని కొట్టాలు వేయవచ్చు. పై కప్పును ఎండిన కన్చాగాద్దితోగాని, తుంగ లేదా తాటి ఆకులతోగాని వర్షపు నీరు కారకుండా కప్పవచ్చు. నీరు, దానా అన్ని మేకలకు అందుబాటులో ఉండే విధంగా దాణా మరియు నీటి తొట్టెలను నిర్మించాలి. ఎండ, వాన, చలి వంటి పరిస్తితులనుండి రక్షణ కలిగించేలా మేకల కొత్తలను నిర్మించాలి. షెడ్ నాలుగు వైపులా, వెలుపల చల్లందనం, మేతనిచ్చే చెట్లు పెంచాలి. షెడ్ లోపల నేలపై మొరము లేదా ఎర్రమట్టిని వేసి ప్రతి 6 నెలలకు ఒకసారి మారుస్తూ ఉండాలి. పాకలో సరిపోయినంత స్థలం ఉండాలి. ఒక్కొక్క ఆడ మేకకు ఒక చ.మీటరు, మేకపోతుకు 2 చ.మీ. మేక పిల్లకు 0.5 చ.మీ. స్థలం ఉండేటట్లు  చూడాలి. శీతాకాలంలో దడి చుట్టూ గోనెసంచులు కప్పిన యెడల రాత్రి వేళల్లో చలిగాలి లోపలి రాకుండా ఉంటుంది.

మేకల వ్యాధులు – నివారణ:
ఇతర జంతువులతో పోలిస్తే మేకల్లో రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి రోగాలకు గురయ్యే అవకాశం తక్కువ. మేకల్లో సాధారణంగా ఈ క్రింది వ్యాధులు కనిపిస్తాయి. అంటువ్యాధులలో పారుడు వ్యాధి (పి.పి.ఆర్), చితుకురోగం, గొంతువాపు, మశూచి, గాలికుంటు ముఖ్యమైనవి. ఈ వ్యాదులన్నిటికీ వ్యాధి నిరోధక టీకాలను సకాలంలో వేయించి రక్షించువచ్చు.
పారుడు వ్యాధి (పి.పి.ఆర్) :
లక్షణాలు
ఈ వ్యాధి వైరస్ క్రిముల వలన వస్తుంది. విపరీతమైన జ్వరం 1070 ఫారిన్ హీట్ వరకు ఉంటుంది. కండ్లు ఎర్రబడి నీరు కారటం, నోటినుండి దొంగ రావడం, చిగుల్లమీద సన్నని పుండ్లు ఏర్పడటం, పలచని విరోచనాలు అవడం ఈ వ్యాధి యొక్క ముఖ్య లక్షణాలు.
నివారణ / చికిత్స
వ్యాధి నిరోధక టీకాల ద్వారా ఈ అంటు వ్యాధిని నివారించవచ్చు.

బొబ్బ రోగం/ మసూచి:
లక్షణాలు
ఈ వ్యాధి డిసెంబరు, జనవరి, ఏప్రిల్, మే నెలల్లో కనిపిస్తుంది. మేకలు, బొబ్బలతోను, ఎక్కువ జ్వరంతోను బాధపడుతుంటాయి. ఈ వ్యాధి వైరస్ వల్ల వస్తుంది. ముక్కుల నుండి నీరు కారడం, వేగంగా ఊపిరి పీల్చడం జరుగుతుంది.
నివారణ
ఈ వ్యాధి రాకుండా అరికట్టేందుకు ప్రతి సంవత్సరం ఫిబ్రవరి నెలలో మేకలకు మశూచి టీకాలు వేయించాలి.
చికిత్స
వ్యాధి సోకిన మేకలను వేరుచేసి పుండ్ల పై  వేపనూనె లేదా హిమాక్స్ వంటి పూత మందులను పూయాలి.
గాలికుంటు :
లక్షణాలు
ఈ వ్యాధి సోకిన మేకల నోటిలో, చిగుల్ల మీద, నాలుక మీద గుల్లలు ఏర్పడి మేత మేయవు. నోటి నుండి చొంగ రావడం, కాల్లగిట్టల మధ్య పుండ్లు ఏర్పడటం గమనించవచ్చు.
నివారణ
ప్రతి 6 నెలలకు ఒకసారి మేకలకు వ్యాధి నిరోధక టీకాలు వేయించి నివారించవచ్చు.
చికిత్స
వ్యాధి సోకిన మేకలను వేరుచేసి పుండ్లపై  వేపనూనె లేదా హిమాక్స్ వంటి పూత మందులను పూయాలి. నోటిలోని పండ్లకు బోరోగ్లిసరిన్ ను పూయాలి. గిత్తల మధ్య పండ్లను పొటాషియం పర్మంగానేట్ ద్రావణంలో కడిగి పూతమందులను పూయాలి.

చిటుకు వ్యాధి :
లక్షణాలు
ఈ వ్యాధి ముఖ్యంగా వర్షాలు పడిన తరువాత మొలకెత్తిన పచ్చిగడ్డిని మేకలు బాగా మేయటం వలన వస్తుంది. మేకలు హటాత్తుగా చనిపోవటం, మేకపిల్లలు కాళ్ళు తన్నుకోవటం, కండలు అదరటం, నోటి నుండి చొంగ కారటం మొదలగునవి ఈ వ్యాధి లక్షణాలు.
నివారణ
చికిత్స

ఈ వ్యాధి రాకుండా ఉండేందుకు మేకలకు వర్షాకాలపు ప్రారంభానికి ౩ వారాల్ ముందుగా “ఎంట్రోం టాక్సీమియా” అనే వ్యాధి నిరోధక టీకాలు వేయించాలి.

మేకలలో టీకాల షెడ్యూలు
టీకా మందు        సమయం          మోతాదు / వయస్సు
మేకల మసూచి        ఫిబ్రవరి              ౩ నెలలు దాటిన మేకపిల్లలకు మొదలుకొని
1 మి. లీ. చర్మం క్రింద
పి. పి.ఆర్ వ్యాధికి      జనవరి              ౩ నెలలు దాటిన మేకపిల్లలకు మొదలుకొని
(ముసర వ్యాది టీకా)                      1 మి. లీ. చర్మం క్రింద

గాలికుంటు           జూన్               ౩ నెలలు దాటిన మేకపిల్లలకు మొదలుకొని
                                    2.5 మి. లీ. చర్మం క్రింద
గొంతువాపు           మార్చి/ ఆగష్టు       ౩ నెలలు దాటిన మేకపిల్లలకు మొదలుకొని
                  (సంవత్సరానికి        2.5 మి. లీ. చర్మం క్రింద
                  రెండుసార్లు)

పై టీకాలను ప్రతి సంవత్సరం తప్పనిసరిగా వేయించాలి.
మేకల పెంపకంలో ఆదాయం పొందటానికి వాటికి ఎలాంటి వ్యాధులు రాకుండా జాగ్రత్త పడాలి. మేకలను పరిశుభ్రమైన పరిసరాలు, మేత, నీరు మరియు ముందు జాగ్రత్త చర్యగా టీకాలు వేసినట్లయితే మరణాల సంఖ్య తగ్గించవచ్చు.
మేకలు మేత మేస్తున్నప్పుడు వాటి ఆహారంతోపాటు కొన్ని అంతర పరాన్న జీవులు (ఏలిక పాములు, బద్దెపురుగులు, జలగలు) వాటి శరీరంలో చేరి, పోషకాన్ని పీల్చివేసి, అనారోగ్యానికి గురిచేస్తాయి. కావున సంవత్సరానికి కనీసం మూడుసార్లు నట్టల నిర్మూలన మందులను త్రాగించాలి. పేలు, పిడుదులు, గోమార్లు మొదలగు బాహ్య పరాన్నజీవులు రక్తాన్ని పేలుస్తు బలహీన పరచటమే కాక కొన్ని అంటు వ్యాధులను కలుగుజేస్తాయి. వాటిని అరికట్టాలంటే వాటి శరీరంపై సుమిసిదిన్, మాలాథియాన్, ఫేన్ వలరేట్ మొదలగు మందులను పిచికారి లేదా డిప్పింగ్  చేయాలి.

 

మేకల్లో సంపర్కం :
 మేకలు దాటించే వయసు వచ్చే సరికి కనీసం 25 కిలోలున్డాలి. ఆడ మేకలు 6-7 నెలలు దాటిన తర్వాత ఆరోగ్యంగా ఉంటె మొదటి ఎదకోస్తాయి. మేకలు సంవత్సరం పొడుగునా ఎదలోకోస్తాయి. ఎక్కువగా మార్చి నుండి మే వరకు, మరల సెప్టెంబరు, నవంబరులో వస్తాయి. మేకలు ఎదలో 1-౩ రోజులుంటాయి. మేకలు ప్రతి 21 రోజులకొకసారి ఎదలూకోస్తాయి. మేకల్లో ఎదను గుర్తించడానికి ఎల్లప్పుడు వేసక్టమి చేసిన మేకపోతును వదలాలి. ఇది యెదలో ఉన్న మేకలను గుర్తించటానికి ప్రయత్నిస్తుంది. ఎదలో ఉన్న మేకలను మంచి జాతి లక్షణాలున్న మేకపోతుతో దాటించాలి. మేకల గర్భధారణ కాలం 150 రోజులు. ఒక మేకపోతు షుమారు 35 ఆడ మకలకు సరిపోతుంది.
చూడి మేకల పెంపకం
మేకలు, చూడి కాట్టిన మూడు నెలల తర్వాత కడుపులోని పిల్లల పెడుగుదల ఎక్కువగా ఉంటుంది. ఈ సమయంలో చూడి మేకలకు మంచి దాణా ఇవ్వాలి. 200 నుండి 250 గ్రాముల వరకు మిశ్రమ దాణా అదనంగా ఇవ్వాలి. ఈ విధంగా చేయతంవలన ఎక్కువ బరువుతో పిల్లలు పుడతాయి. మేక ఆరోగ్యం బాగుండి ఎక్కువ పాలిస్తుంది. మరియు పిల్లలు బాగా పెడుగుతాయి. పచిమేత, చెట్ల ఆకులతో బాగా మేపాలి. శుభ్రమైన నీటిని త్రాగించాలి. కొద్దిపాటి వ్యాయామం అవసరం. అందుకుగాను షెడ్ చుట్టు ఉన్న ఖాలీస్థలంలో తిరగటానికి వదలాలి.

 

మేకపిల్లల్లో తీసుకోవలసిన జాగ్రత్తలు:
మేకపిల్లలు పుట్టిన వెంటనే ముక్కు రంధ్రాలు, నోటిపైనున్న పొరలను తీసివేయాలి. మేక పిల్లల బొడ్డుకు టింక్చర్ అయోడిన్ పూయాలి, పిల్లలను ఉంచే ప్రదేశంలో 10% ఫినాల్ ను చల్లాలి. ఈనిన వెంటనే మేక పొదుగును శుభ్రంగా కడిగి, తర్వాత పిల్లలకు పాలు త్రాగించాలి. మొదటి మూడు రోజులు, తల్లిపాలు రొజూ త్రాగించాలి. (రోజుకు మూడుసార్లు) ఈ ముర్రు పాలు చాలా బలమయినవి. ముర్రు పాలలో రోగ నిరోధక శక్తి నిచ్చే ఆన్టిబాడీలు, విటమిన్లు ఎక్కువగా ఉంటాయి. మొదటిసారి ముర్రు పాలను జర్మించిన 6 గంటల వ్యవధిలోపు త్రాపాలి. రెండు నెలల వయసు వచ్చే వరకూ మేక పిల్లలకు తల్లిపాలు త్రాగించాలి. ఆ తర్వాత తల్లిపాలు పూర్తిగా మాన్పించి వాటికి దాణా, పచ్చిమేత, లేత ఆకులు అందుబాటులో ఉంచాలి. మేక పిల్లలు రెండు వారాలు దాటగానే బయటికి పిల్లల (క్రీపు) దాణా ఇవ్వాలి. ప్రతిరోజు 100 గ్రా. చొప్పున పిల్లల (క్రీపు) దాణా ఇవ్వాలి. మేక పిల్లల షెడ్ పరిశుభ్రంగా ఉండాలి. లేదా అవి నేలను నాకి అజీర్ణానికి గురయి, పారుకుంటాయి. మేక పిల్లల షెడ్ లో ఉప్పు, లవణ మిశ్రమ ఇటుకులను ఏర్పాటు చేయాలి. మేక పిల్లల షెడ్ లోని నేలపై ప్రతి 15 రోజుల కొకసారి పొడి సున్నం చల్లాలి. మూడు మసాల వయసు దాటిన మేకపిల్లలకు నత్తల నిర్మూలన మందులు త్రాగించాలి. ముందు జాగ్రత్తగా టీకాలు వేయించాలి. పునరుత్పత్తికి ఉపయోగించని మగ పిల్లలకు విత్తుకోట్టాలి, దీనివలన మాంసపు నాణ్యత పెరుగుతుంది.
పిల్లల  దానాలో 28 భాగాల మొక్క జొన్నలు, 20 భాగాల వేరుశనగ చక్క 10 భాగాల గోధుమ పొట్టు, 11 భాగాల బియ్యపు తవుడు, 18 భాగాల బియ్యపు నూక, 10 భాగాల జొన్నలు (లేక) సజ్జలు, 2 భాగాల లవణ మిశ్రమం, 1 భాగం ఉప్పు ఉంచాలి. దీనిని తయారు చేయటానికి స్థానికంగా దొరికే దినుసులు వాడాలి. ధరలను బట్టి వీటిని మార్చుకొనవచ్చు.